ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. మద్యం తాగి ఆత్మహత్య చేసున్నాడని పోలీసులు చెబుతున్నారని..అసలు ఫాం హౌస్‌లోకి మందు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మృతిపై అనుమానాలున్నాయని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేపు 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ఎమ్మార్పీస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు మందకృష్ణ తెలిపారు.
ఫాంహౌస్‌లోకి మద్యం ఎలా వచ్చింది?: మందకృష్ణమాదిగ - KCR FORM HOUSE
కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో ఆత్మహత్య చేసుకున్న హెడెకానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మృతిపై మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఫాంహౌస్‌లోకి ఎలా మద్యం వచ్చింది?: మందకృష్ణమాదిగ