ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తికి ప్రాణహాని తలపెట్టవద్దని సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ దళం సభ్యుడు సూర్యం భార్య స్వరూప పోలీసులను కోరింది. వరంగల్ గ్రామీణ జిల్లా కొండాపూర్ శివారులో పోలీసులు జరిపిన గాలింపులో... తన భర్త చిక్కాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. సూర్యాన్ని కోర్టులో హాజరుపర్చాలని ఆమె డిమాండ్ చేసింది. దళ నాయకుడు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
ఎన్కౌంటర్ చేయకండి - swarupa
వరంగల్ గ్రామీణ జిల్లా కొండాపూర్ శివారులో విస్తృత గాలింపు చేపట్టిన పోలీసులకు దళ నాయకుడు సూర్యం చిక్కినట్లు అతడి భార్య స్వరూప అనుమానం వ్యక్తం చేసింది. తన భర్తను ఎన్కౌంటర్ చేయవద్దని వేడుకుంటోంది.
సూర్యం భార్య స్వరూప