ఈ నెల 28 వరకు దరఖాస్తు స్వీకరణ...
మెడికల్, డెంటల్ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - UNIVERSITY
కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలతోపాటు హైదరాబాద్ నిమ్స్‌లోని కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న మెడికల్, డెంటల్ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ నోటిఫికేషన్
ఇవాళఉదయం 11 గంటల నుంచి 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.in లో పొందుపరిచారు. పీజీ మెడికల్ ప్రవేశానికి జనరల్ కేటగిరిలో 50 శాతం అర్హత మార్కులకు గానూ.. 340, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతంకు గానూ.. 295, దివ్యాంగులు( ఓసీ)లకు 45 శాతం సూచించగా 317 కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు.
ఇవీ చూడండి:"నిన్న పాఠశాల ఉన్నా నా కూతురు దక్కేది"