తెలంగాణ

telangana

ETV Bharat / state

పరకాలకు చేరిన ఇన్నోవేషన్​ యాత్ర

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్నోవేషన్​ యాత్ర వరంగల్​ జిల్లా పరకాలలోని యువ రైతు మహిపాల్​ చారి ఇంటికి చేరుకుంది. యువరైతు చేసిన వ్యవసాయ పనిముట్లను చూసి విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

innovation yatra in warangal
పరకాలకు చేరిన ఇన్నోవేషన్​ యాత్ర

By

Published : Feb 20, 2020, 12:42 PM IST

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించి.. వారిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, ఇన్నోవేటివ్ సెల్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా 'ఇన్నోవేషన్​ యాత్ర'ను చేపడుతోంది. ఈనెల 19న వరంగల్​లో ప్రారంభమైన ఈ యాత్ర పరకాలలోని గ్రామ సైంటిస్ట్ మహిపాల్ చారి ఇంటికి చేరింది.

మహిపాల్ చారి రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన 'పవర్​ ట్రిల్లర్​' పరికరాన్ని చూసి ఇన్నోవేషన్​ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిపాల్ చారి లాంటి మేధావుల నుంచి తాము ఎంతో నేర్చుకున్నామని విద్యార్థులు చెప్పారు. ఇన్నోవేషన్​ యాత్ర చేపట్టడానికి తాము సెలెక్ట్​ అవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

చదువు రాని ఒక వ్యక్తి ప్రజలకు ఉపయోగపడే యంత్రాలను తయారు చేస్తుంటే.. అతన్ని ఆదర్శంగా తీసుకొని తాము చదువుకున్న చదువుకి సరైన న్యాయం చేస్తామని ఈ దేశానికి ఉపయోగపడేలా తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు అన్నారు.

పరకాలకు చేరిన ఇన్నోవేషన్​ యాత్ర

ఇదీ చూడండి:ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

ABOUT THE AUTHOR

...view details