తెలంగాణ

telangana

ETV Bharat / state

చింత సాంబమూర్తి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. వరంగల్ భాజపా అభ్యర్థి తరఫున ఆ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

By

Published : Apr 8, 2019, 2:20 PM IST

చింత సాంబమూర్తిని గెలిపించాలి : పెదగోని సోమయ్య

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో భాజపా ఇంటింటి ప్రచారం నిర్వహించింది. వరంగల్ అభ్యర్థి చింత సాంబమూర్తిని గెలిపించాలని పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. అసలైన తెలంగాణ వాదులు భాజపా నాయకులేనని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెదగోని సోమయ్య అన్నారు. మచ్చలేని వ్యక్తి సాంబమూర్తిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. దేశ ప్రగతికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. భాజపా అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రయోజనం చేకూరుతుందన్నారు.

భాజపా ఇంటింటి ప్రచారం

ABOUT THE AUTHOR

...view details