వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. నియోజకవర్గంలోని ఆత్మకూరు, గీసుకొండ, సంగం, దామెర, పరకాల, నడికుడ మండలాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి.
భారీ వర్షంతో ఓ వైపు ఆనందం.. మరోవైపు భయం - weather report
నిన్నటి వరకు భానుడి భగభగలతో సతమతమైన ప్రజలకు... వరుణుడి రాకతో కొంత ఉపశమనం దొరికింది. కానీ.. ఆ ఆనందాన్ని ప్రజలు ఆస్వాదించలేకపోతున్నారు. ఈ వర్ష ప్రభావం కరోనా విస్తరణపై ఎక్కడ పడుతుందోనని తీవ్రం భయాందోళనకు గురవుతున్నారు.
భారీ వర్షంతో ఓ వైపు ఆనందం.. మరోవైపు భయం
నిన్నటి వరకు ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరైన ప్రజలు... వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల వర్షప్రభావం వైరస్ విస్తరణపై పడుతుందేమోనని భయపడుతున్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షంలో తడవడం ఆరుబయట కూర్చోవడం మానేస్తే మంచిదని వివరిస్తున్నారు.