తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామంలో ఉద్రిక్తత... 144 సెక్షన్ అమలు - 144 section

పెళ్లిలో జరిగిన చిన్న వాగ్వాదం ఆ గ్రామంలో ఉద్రిక్తతలకు కారణమైంది. అధికార పార్టీ నేతలు చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు గ్రామస్థులు. ఎటువంటి గొడవలు జరగకుండా 144 సెక్షన్​ అమలు చేశారు.

గ్రామంలో గస్తీ కాస్తున్న పోలీసులు

By

Published : Mar 24, 2019, 11:09 AM IST

గ్రామంలో గస్తీ కాస్తున్న పోలీసులు
వరంగల్ రూరల్​ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఓ వివాహంలో తెరాస నాయకులతో వాగ్వాదానికి దిగారు గ్రామస్థులు. గ్రామ ప్రజలను, సర్పంచ్ భర్తను చంపుతామంటూ చల్లా దామోదర్ రెడ్డి, గౌరు రమణరెడ్డి బెదిరించారని ఆరోపించారు.

గ్రామంలో 144 సెక్షన్...

గ్రామంలో ఉద్రిక్తత వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి గొడవలు జరగకుండా నాగారంలో 144 సెక్షన్​ను అమలు చేశారు. రాత్రంతా గస్తీ కాస్తూ అక్కడే ఉన్నారు.

ఇవీ చూడండి:నిజాంపేట్​లో ఇంజినీరింగ్ కళాశాల బస్సు బీభత్సం

ABOUT THE AUTHOR

...view details