కారు బీభత్సం... గడ్డివాములు దగ్ధం - FIRE ACCIDENTS
అతి వేగంతో వచ్చిన ఓ కారు... విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో చోటుచేసుకుంది.
కారు బీభత్సం... గడ్డివాములు దగ్ధం
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల శివారులో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. కరెంటు తీగల నుంచి మిరుగులు ఎగిసిపడి మూడు గడ్డివాములు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు వ్యాపించకుండా కట్టడి చేశారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.