వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారా తయారీ రోజురోజుకు విస్తరిస్తోంది. అధికారులు దాడులు చేస్తున్నా గుడుంబా స్థావరాల నిర్వాహకులను ఏమాత్రం నిలువరించలేకపోతున్నారు. తాజాగా వర్ధన్నపేట మండల పరిధిలోని గుబ్బెడు తండా వద్ద కారులో తరలిస్తున్న 150 కేజీల నల్లబెల్లం, 10 లీటర్ల నాటుసారా, 3కేజీల పటికను అబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. ఒకే వారంలో ఇది మూడో ఘటనగా అధికారులు ధ్రువీకరించారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో జోరుగా నాటుసారా తయారీ - gudumba caught
వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారా తయారీ పెరిగిపోతోంది. వర్ధన్నపేట మండల పరిధిలోని గుబ్బెడు తండా వద్ద కారులో తరలిస్తున్న నల్లబెల్లం, సాటుసారా, పటికను అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో జోరుగా నాటుసారా తయారీ