తెలంగాణ

telangana

ETV Bharat / state

KMC పీజీ వైద్య విద్యార్థిని ఘటన.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ - KMC PG student suicide case update

CP on KMC PG Student Suicide Attempt Case : కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై ఓవైపు కమిటీ విచారణ చేపడుతోంటే.. మరోవైపు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సీపీ రంగనాథ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్​ను కలిసి ఘటన వివరాలపై ఆరా తీశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటన గురించి కీలక విషయాలు వెల్లడించారు.

CP Ranganath
CP Ranganath

By

Published : Feb 24, 2023, 1:55 PM IST

Updated : Feb 24, 2023, 3:31 PM IST

CP on KMC PG Student Suicide Attempt Case : వరంగల్​ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడు సైఫ్​ను అరెస్టు చేసినట్లు చెప్పిన సీపీ.. ఆమెను టార్గెట్ చేసి వేధించాడని స్పష్టం చేశారు. అందరి ముందూ సైఫ్ ఆ అమ్మాయిని అవమానించాడని చెప్పారు. ఏమైనా ఉంటే హెచ్​వోడీకి ఫిర్యాదు చేయాలని ఆమె చెప్పిందని.. అయినా సైఫ్ వినిపించుకోలేదని తెలిపారు.

KMC పీజీ వైద్య విద్యార్థిని ఘటన.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ

"ఇక్కడ కల్చర్ గురించి అందరితో మాట్లాడాను. ఇక్కడ సీనియర్‌ను జూనియర్లు సార్‌ అని పిలవాలనే కల్చర్‌ ఉంది. వైద్య విద్యార్థిని చాలా తెలివైన, ధైర్యం ఉన్న అమ్మాయి. సైఫ్ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నించాడు. వైద్య విద్యార్థిని ప్రశ్నించే తత్వం సైఫ్‌కు నచ్చలేదు. ఈనెల 18న వాట్సాప్‌ గ్రూప్‌లో ఛాటింగ్‌ చేశారు. గ్రూప్‌లో నన్ను ఉద్దేశించి ఛాట్‌ చేయడం సరికాదని సైఫ్‌కు వ్యక్తిగతంగా వాట్సాప్‌ మెసేజ్‌ పంపింది. ఏదైనా ఉంటే హెచ్‌వోడీలకు ఫిర్యాదు చేయాలిగానీ.. అవమానపరచవద్దని చాట్‌ చేసింది. ఈనెల 20న ఈ విషయాన్ని తండ్రి దృష్టికి వైద్య విద్యార్థిని తీసుకెళ్లారు. ఈనెల 20న రాత్రి వైద్య విద్యార్థిని వద్దకు తండ్రి వచ్చారు. వైద్య విద్యార్థిని తండ్రితో అన్ని విషయాలు మాట్లాడాం." - రంగనాథ్, వరంగల్ సీపీ

వైద్య విద్యార్థినితో మాట్లాడాక ఏసీపీ, మట్వాడా ఎస్‌ఐ దృష్టికి ఇదే విషయాన్ని వైద్య విద్యార్థిని తండ్రి తీసుకెళ్లారని సీపీ చెప్పారు. ఈనెల 21న ఉదయం మొదట సైఫ్‌తో, తర్వాత వైద్య విద్యార్థినితో హెచ్‌వోడీ మాట్లాడారని తెలిపారు. తను వేధించాలనే ఉద్దేశంతో అలా చేయలేదని.. సీనియర్‌గా నేర్చించాలన్న ఆలోచనతోనే చెప్పానని హెచ్‌వోడీకి సైఫ్‌ చెప్పాడని సీపీ వివరించారు. గ్రూపులో పోస్టు చేసి అవమానపరిచావని సైఫ్‌తో వైద్య విద్యార్థిని చెప్పినట్లు వెల్లడించారు. సైఫ్‌ అనే వ్యక్తి తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నాడని స్నేహితులకు చేసిన చాట్‌లో విద్యార్థిని పేర్కొన్నట్లు తెలిపారు. బ్రెయిన్‌ లేదని హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని స్నేహితులకు చేసిన చాట్​లో ఉన్నట్లు పేర్కొన్నారు.

"ఒక వ్యక్తి ఇన్‌సల్ట్‌గా ఫీలయితే అది ర్యాగింగ్‌కు కిందకే వస్తుంది. ఈ అమ్మాయినే లక్ష్యంగా చేసుకుని అవహేళన చేస్తున్నట్లు ఛాట్స్‌ ద్వారా వెల్లడైంది. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్టు చేశాం. మొదట్నుంచీ సైఫ్‌ వల్ల వైద్య విద్యార్థిని ఇబ్బందిగా భావించింది. డిసెంబర్‌ 6 సహా రెండు మూడు సార్లు చిన్న ఘటనలు జరిగాయి. సీనియర్లను జూనియర్లు సార్‌ అనాలనే విధానం ఇక్కడ పాటిస్తున్నారు బాసిజం తరహాలో ఉందని ఆమె భావించింది. వైద్య విద్యార్థిని చాలా ధైర్యం కలది.. తెలివైన అమ్మాయి.. అలాగే సున్నిత మనస్తత్వంకళాశాలలో ర్యాగింగ్‌ కల్చర్‌ ఉందని అనలేంగానీ వ్యక్తిగతంగా వేధిస్తున్నారన్న భావన కలిగింది." అని సీపీ రంగనాథ్ తెలిపారు.

Last Updated : Feb 24, 2023, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details