వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలోని నార్లాపూర్, వెంకటేశ్వర్లపల్లి శివారులోని వాగులో చెక్ డ్యాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. చెక్ డ్యాం పనుల నిమిత్తం రూ.6 కోట్ల 18 లక్షలు మంజూరైన నేపథ్యంలో నిర్మాణం మొదలుపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో కరోనాపై సంపూర్ణ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చెక్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి - warangal rural district
వరంగల్ రూరల్ జిల్లాలోని నడికూడ మండల పరిధిలో చెక్ డ్యాం నిర్మాణ నిమిత్తం పనులకు శంకుస్థాపన జరిగింది. సుమారు 6 కోట్ల 18 లక్షల రూపాయల ఖర్చుతో చెక్ డ్యాం నిర్మించనున్నారు.
చెక్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం