వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్నిరకాల పరికరాలు, వైద్యులు అందుబాటులో ఉన్న డెలివరీలకు ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు రిఫర్ చేస్తున్నారని కలెక్టర్ వైద్యులను ప్రశ్నించారు. విధుల్లో అలసత్వాన్ని సహించబోమన్నారు. పనితీరు మెరుగుపరుచుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నర్సంపేట ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నా... డెలివరీలను ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేయడంపై మండిపడ్డారు.
నర్సంపేట ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్