నాటిన ప్రతీ మొక్కకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో పర్యటించిన ఆమె హరితహారం కార్యక్రమంలో భాగంగా సంగెం మండలం గవిచర్ల, ఆశాలపల్లి గ్రామాల్లో మొక్కలు నాటారు.
నాటిన ప్రతి మొక్కకి రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ హరిత
ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని.. అలా నాటిన ప్రతి మొక్కకూ రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. పలు గ్రామాల్లో పర్యటించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
నాటిన ప్రతి మొక్కకి రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ హరిత
అనంతరం ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక పనులను పరిశీలించారు.
ఇదీ చూడండి:భాగ్యనగరంలో భారీ వర్షం.. తడిసి ముద్దయిన జనం