వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి, ఉప్పులపల్లి గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు. ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా వనాల ఏర్పాటు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్న నర్సరీలను ఆయన సందర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలసుకున్నారు.
హరితహారంతో భవిష్యత్తు తరాలు భద్రం: కలెక్టర్ - collector hanumantha visit at villages in warangal rural district
వరంగల్ అర్బన్ జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు. వనాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్ హనుమంతు
ఆరో విడత హరితహారంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. ప్రజలందరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపడాలని కలెక్టర్ సూచించారు. ఇప్పుడు మనం నాటిన మొక్కలు.. రేపటి తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందిస్తాయని చెప్పారు.
Last Updated : Jul 13, 2020, 9:58 PM IST
TAGGED:
COLLECTOR VISIT