వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో చెన్నకేశవ స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఘనంగా ప్రారంభమైన చెన్నకేశవ స్వామి జాతర - చెన్నకేశవ స్వామి జాతర
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లాలో జరిగే చెన్నకేశవ స్వామి జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జాతర ప్రారంభమైంది.
ఘనంగా ప్రారంభమైన చెన్నకేశవ స్వామి జాతర
చెన్నకేశవ స్వామి జాతర నిర్వహణకు ఆలయ కమిటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. స్వామి వారి ధర్శనం కోసం చెన్నారావుసేట, నెక్కొండ, నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం తదితర మండలాల నుంచి భక్తులు అక్కడికి విచ్చేశారు. జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:ఐనవోలు జాతరకు జనసందోహం.. అధికారుల వైఫల్యం