ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని కోరుతూ... ఓ సామాజిక ఉద్యమకారుడు సైకిల్‌పై ప్రచారం నిర్వహించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక ఉద్యమకారుడు రావుల భాస్కర్‌రావు ప్రజలందరూ.. ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ సైకిల్‌పై ప్రచారం చేశారు. గ్రామంలోని పలువురి ఇంటికి వెళ్లి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలని సైకిల్‌పై ప్రచారం - vote awareness
ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ.. ఓ సామాజిక ఉద్యమకారుడు సైకిల్‌పై ప్రచారం నిర్వహించారు. ప్రజలంతా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సైకిల్‌పై ప్రచారం