వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ నిర్మాణ దశలోనే నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండుటెండల్లో బస్సుల కోసం రోడ్డు పక్కన, దుకాణాల ముందు నిలబడుతున్నామని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. తమ దుకాణాల ముందు నిలబడితే అమ్మకాలు ఎలా జరుపుకోవాలని దుకాణదారులు ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. పలు గ్రామాల నుంచి మండల కేంద్రం మీదుగా వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
'బస్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి'
బస్సుల కోసం మండుటెండల్లో నిలబడుతున్నామని వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా బస్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.
మండుటెండల్లో బస్సుల కోసం రోడ్డు పక్కన నిలబడుతున్నాం...