తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త - yadagiri

కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికిచంపాడో కసాయి. కలకాలం కలిసి ఉండాల్సిన సహచరిణిని క్షణకావేశంలో నరికేశాడు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్న పేటలో ఈ దారుణం జరిగింది.

భార్యను చంపిన భర్త

By

Published : May 24, 2019, 12:48 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో దారుణం జరిగింది. చెవ్వల యాదగిరికి, మల్లికాంబతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. యాదగిరి వేధింపులు భరించలేక మల్లికాంబ తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. వారం కిందట ఊరి పెద్దలు భార్య, భర్తలకు నచ్చచెప్పి కలిసి ఉండాలని సూచించారు. కొద్దిరోజులు బాగానే కలిసి ఉన్నా... యాదగిరి తెల్లవారుజామున భార్యతో గొడవపడి గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

భార్యను చంపిన భర్త

ABOUT THE AUTHOR

...view details