ఘనంగా ఎంగిలిపూల బతుమ్మ సంబురాలు - batukamma celebrations
ఎంగిపూల బతుకమ్మ వేడుకలను వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
ఘనంగా ఎంగిలిపూల బతుమ్మ సంబురాలు
వరంగల్ రూరల్ జిల్లా పరకాల, చుట్టుపక్కల గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఎంగిలిపూల బతుకమ్మ ఇళ్లల్లో శుభాలను ఇస్తుందని.. ఆనందోత్సవాల మధ్య అతివలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆడుకున్నారు. గ్రామాల సర్పంచులు.. మహిళలతో కలిసి ఆడిపాడారు. గౌరమ్మ గ్రామాన్ని సౌభాగ్యంగా ఉంచుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.