వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎండాకాలం అయినప్పటికీ బ్యాంకుకు వచ్చిన వారు తాగేందుకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు నిర్వహణ సిబ్బంది. వందలాది మంది ఖాతాదారులతో బ్యాంకు నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. డబ్బులు వేయాలన్నా... తీసుకోవాలన్నా క్యూలైన్లో గంటల తరబడి వేచి చూడాల్సిందే. మండు వేసవిలో కనీసం నీటి వసతి కల్పించని బ్యాంక్ అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఆవరణలో ఫ్రిజ్ ఉన్నా అందులో నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుకు వెళ్తే గొంతెండాల్సిందే.. - sbi
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఎస్బీఐ బ్యాంక్లో పనులవ్వాలంటే గంటల కొద్దీ నిలబడాల్సిందే. అసలే ఎండాకాలం ఆపై తాగేందుకు గుక్కెడు నీరు కూడా అందింట్లేదు బ్యాంకు సిబ్బంది.
బ్యాంకుకు వెళ్తే గొంతెండాల్సిందే..