మహిళా రైతులకు కుటీర పరిశ్రమలు, నైపుణ్యాల పెంపుపై కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మహిళా అవగాహన
By
Published : Feb 21, 2019, 10:26 PM IST
అవగాహమహిళా అవగాహనన
వరంగల్ గ్రామీణ జిల్లా పెరికవేడు గ్రామంలో మహిళా రైతులకు కుటీర పరిశ్రమలపై అవగాహన కల్పించారు. పండించిన పంటను విలువ ఆధారిత పదార్థాలుగా తయారు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని నాబార్డ్ ఏజీఎం కృష్ణమూర్తి తెలిపారు. రైతులు సమూహాలుగా ఏర్పడితే సబ్సిడీ మీద బ్యాంకు రుణాలు పోందవచ్చన్నారు. నైపుణ్యం పెంచుకుని ముందుకెళ్లాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరసింహ, అరుణ జ్వోతిలు రైతులకు పలు సూచనలు చేశారు.