తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట ఘటనలో నిందితుడిని ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు సీపీ హాజరుపరచనున్నారు.
'సాయంత్రం మీడియా ముందుకు కిల్లర్ సంజయ్' - గొర్రెకుంట బావి ఘటన
10:08 May 25
'సాయంత్రం 4గంటలకు మీడియా ముందుకు కిల్లర్ సంజయ్'
శీతల పానీయంలో నిద్రమాత్రలు ఇచ్చి... అపస్మారకస్థితిలోకి వెళ్లాక గోనె సంచుల్లో లాక్కెళ్లి బావిలో పడేశాడు. హత్యలు చేసినట్లు బిహార్ యువకుడు సంజయ్ కుమార్ యాదవ్ ఒప్పుకున్నాడు. మొత్తం 9 మందిని హతమార్చాడు. వరంగల్ పోలీసులు కాల్‌డేటా ఆధారంగా కేసును ఛేదించారు.
గొర్రెకుంట బావి ఘటన మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రామన్నపేట పోతన మందిరం వద్ద శ్మశానవాటికలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకుల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఎంజీఎం మార్చురీ వద్ద శ్మశానంలో మక్సూద్, కుటుంబసభ్యుల అంత్యక్రియలు చేయనున్నారు.
- సంబంధిత కథనాలు: ఆ బావిలో తొమ్మిది మృతదేహాలు..
- సంబంధిత కథనాలు:బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి
- సంబంధిత కథనాలు: ఆపరేషన్ బావి
- సంబంధిత కథనాలు: నువ్వైనా చెప్పవే! ఎలా జరిగిందో... ఎవరు చేశారో..?
- సంబంధిత కథనాలు: బావి ఘటనలో దర్యాప్తు ఇలా సాగింది..