వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఏకే తండాకు చెందిన నర్సింహ మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకుకు వెళ్లాడు. తన ఖాతాలో డబ్బులు జమ చేయాలని కోరగా వారం రోజుల తర్వాత రావాలని బ్యాంక్ మేనేజర్ మానస సూచించారు. తాను హైదరాబాద్లో ఉంటున్నానని మళ్లీ రావడం ఇబ్బంది అవుతుందని చెప్పినా పట్టించుకోకుండా ఖాతా పుస్తకం చించేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు అరగంట పాటు బ్యాంకు ముందు బైఠాయించాడు.
బ్యాంకు ముందు ఖాతాదారుడి రచ్చ
బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వెళ్తే బ్యాంకు మేనేజర్ ఖాతా పుస్తకాన్ని చించేసిందని ఓ ఖాతాదారుడు బ్యాంకు ముందు బైఠాయించాడు. అయితే బ్యాంక్ మేనేజర్ మాత్రం తాగొచ్చి రచ్చ చేశాడని ఆరోపించారు.
ఖాతాదారుడు ఇష్టారీతిలో మాట్లాడాడు : బ్యాంకు మేనేజర్
మద్యం సేవించి బ్యాంకు సమయం ముగిసిన తర్వాత వచ్చి ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఇష్టారీతిలో మాట్లాడడని బ్యాంకు మేనేజర్ మానస ఆరోపిస్తున్నారు. అతనే ఖాతా పుస్తకం చించేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.