తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొత్తకోటలో గులాబీ జెండా ఎగరాలి' - 'కొత్తకోటలో గులాబీ జెండా ఎగరాలి'

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు.

wanaparthy trs municipal elections campaign
'కొత్తకోటలో గులాబీ జెండా ఎగరాలి'

By

Published : Jan 15, 2020, 3:31 PM IST

'కొత్తకోటలో గులాబీ జెండా ఎగరాలి'

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ పర్యటించారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.

ఆరేళ్ల కేసీఆర్​ పాలనలో తెలంగాణ.. అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తున్న కేసీఆర్​కు... మున్సిపల్​ ఎన్నికల విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి కొత్తకోటలో గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details