తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించరా? ఐతే.. తాళం తీసేది లేదు'

వనపర్తి జిల్లా చిన్నమారుర్​లో గ్రామ సమస్యలు పరిష్కరించడం లేదంటూ... సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, వార్డు సభ్యులను గ్రామస్థులు  గ్రామపంచాయతీలో నిర్బంధించారు.

తాళం తీసేది లేదు

By

Published : Sep 25, 2019, 6:24 PM IST

గ్రామ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ... సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, వార్డు సభ్యులను గ్రామస్థులు గ్రామపంచాయతీలో నిర్బంధించిన ఘటన వనపర్తి జిల్లా చిన్నమారుర్​లో చోటుచేసుకుంది. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి రోగాలబారిన పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, వార్డు సభ్యులను గ్రామపంచాయతీలో నిర్బంధించి తాళం వేశారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అధికారులు వచ్చే వరకు తాళం తీసేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక ఎక్కడ పోయిందని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. పోలీసులు వచ్చినా.. తాళం తీయకుండా అడ్డుకున్నారు. పై అధికారులు వచ్చేంత వారని వదిలేదంటూ.. గ్రామపంచాయతీ ముందు గ్రామస్థులు కూర్చున్నారు.

తాళం తీసేది లేదు

ABOUT THE AUTHOR

...view details