వినాయక నవరాత్రులు పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులోని లక్ష్మి గణపతి ఆలయంలో వినూత్నరీతిలో గణపతిని తయారు చేశారు. అన్ని రకాల కూరగాయలతో శాకాంబరి గణపయ్యను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని మహిళలు పాల్గొని శాకంబరీ గణపతికి దీపారాధన చేశారు. ఆలయంలోని మూలవిరాట్ను సైతం అన్ని రకాల కూరగాయలతో అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. వినాయక వ్రతంలో భాగంగా ఏటా శాకాంబరి గణపతిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కూరగాయలతో శాకాంబరి బొజ్జ గణపయ్య.. - wnp
వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో అన్ని రకాల కూరగాయలతో శాకాంబరి గణపయ్యను ఏర్పాటు చేశారు. పట్టణంలోని మహిళలు శాకంబరీ గణపతికి దీపారాధన చేశారు.
కూరగాయలతో శాకాంబరి బొజ్జ గణపయ్య..