తెలంగాణ

telangana

ETV Bharat / state

వనపర్తి జిల్లాలో ముగిసిన నామినేషన్ల ఘట్టం - WANAPARTHY DISTRICT

స్థానిక సంస్థల ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ గడువు నేటితో ముగిసింది. వనపర్తి జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.

ముగిసిన నామ పత్రాల స్వీకరణ

By

Published : Apr 28, 2019, 11:40 PM IST

ప్రాదేశిక ఎన్నికల నామ పత్రాల దాఖలుకు చివరి ఘట్టం ముగిసింది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో రెండో విడత నామినేషన్లు పూర్తయ్యాయి. రెండో విడత ఆఖరి రోజున వనపర్తి జిల్లాలో 5 జడ్పీటీసీ స్థానాలకు 21 నామ పత్రాలు, 43 ఎంపీటీసీ స్థానాలకు 129 నామినేషన్లు సమర్పించారు. నామ పత్రాల సమర్పణకు చివరి రోజు సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు నామ పత్రాలు స్వీకరించారు.

అభ్యర్థుల వెంట భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

ABOUT THE AUTHOR

...view details