తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి - Telangana

వనపర్తి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా చేపట్టాలని నినాదాలు చేశారు.

విమోచన దినం

By

Published : Sep 17, 2019, 5:50 PM IST


సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని... అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు, వనపర్తి భాజపా జిల్లా కార్యవర్గం డిమాండ్ చేశాయి. ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా చేపట్టాలని నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులు కలెక్టరేట్​ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. రాజీవ్ చౌక్​లో భాజపా జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్​ను గద్దె దింపి భాజపాకు పట్టం కట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details