వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. చేతికొచ్చిన వరి పంట వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కూడా వర్షానికి తడిసి ముద్దైందని రైతులు వాపోయారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
వనపర్తి జిల్లాలో వడగండ్ల వాన.. తడిసిపోయిన పంట
ఆరుగాలం శ్రమించి పండించిన పంట అరగంట పాటు కురిసిన అకాల వర్షానికి తడిసిపోయింది. జిల్లాలో వరి పంట పూర్తిగా నీటిపాలవ్వగా.. రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
వనపర్తిలో వడగండ్ల వాన.. తడిసిముద్దైన పంట
అకాల వర్షం కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి:గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు : మంత్రి నిరంజన్ రెడ్డి