వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో 33/11కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో వనపర్తి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇక్కడి వేరుశనగ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఎర్రవల్లి సమీపంలోని నూనె పరిశ్రమను తిరిగి ప్రారంభించి, స్వచ్ఛమైన నూనెను ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.
విద్యుత్ వెలుగులు
రూ.కోటి 90 లక్షల వ్యయంతో కొత్తకోట మండలంలో నూతన విద్యుత్ ఉపకేంద్రం నిర్మించారు. విద్యుత్ ఉప కేంద్ర ఏర్పాటుతో విద్యుత్ సమస్యలు తొలగిపోతాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
విద్యుత్ ఉప కేంద్ర ఏర్పాటుతో విద్యుత్ సమస్యలు తొలగిపోతాయి : నిరంజన్ రెడ్డి