ETV Bharat / state
కట్టుదిట్టమైన భద్రతల మధ్య పోలింగ్ - WANAPARTHY POLING
వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో దశ ప్రాదేశిక ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు లైజన్ అధికారి నర్సింహులు పేర్కొన్నారు.
కట్టుదిట్టమైన భద్రతల మధ్య పోలింగ్
By
Published : May 14, 2019, 10:06 AM IST
| Updated : May 14, 2019, 12:26 PM IST
కట్టుదిట్టమైన భద్రతల మధ్య పోలింగ్ వనపర్తి జిల్లాలోని పెబ్బేర్, శ్రీరంగాపూర్, పానగల్స చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో తుది దశ ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. 5 మంది జడ్పీటీసీ, 45 మంది ఎంపీటీసీలు బరిలో ఉన్నారు. 240 పోలింగ్ కేంద్రాల్లో 38 బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ ప్రత్యేక నిఘా విభాగాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు.. 38 వెబ్ కెమెరాలు, తొమ్మిది మంది మైక్రో అప్స్, పదిమంది జోనల్ అధికారులు, 1700 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పర్యవేక్షణాధికారి నర్సింహులు తెలిపారు. Last Updated : May 14, 2019, 12:26 PM IST