వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపులో మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపించారు. ఇవాళ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి రూ.1020 డీజిల్ కొనుగోలు చేస్తే... రూ. 820 విలువైన ఇంధనం మాత్రమే కారులో పోసినట్లు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న మోసాన్ని మేనేజర్ దృష్టికి తీసుకుపోగా సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు వారు వివరించారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై నరేందర్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి చర్యలు తీసకుంటామని ఇచ్చిన హామీతో నిరసన విరమించారు.
పెట్రోల్ పంపులో మోసాలపై వినియోగదారుల నిరసన - customer strike in wanaparthy
పెట్రోల్ పంపులో మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళనకు దిగిన ఘటన వనపర్తిలో చోటు చేసుకుంది. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ... వాహనదారులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
పెట్రోల్ పంపులో మోసాలపై వినియోగదారుల నిరసన