తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాతను ఏడిపిస్తున్న ఉల్లి పంట - RAITHULU

ఆరుగాలం కష్టించి సాగుచేసిన ఉల్లి పంట ధర లేక రైతుకు కన్నీరు తెప్పిస్తోంది. గిట్టుబాటు అయితలేదని పండిన పంటను పొలంలోనే వదిలేస్తున్నారు కర్షకులు.

రైతన్నలను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి

By

Published : Mar 19, 2019, 7:15 PM IST

రైతన్నలను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి
ఉల్లి ధర మళ్లీ పతనమవుతోంది. 6నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో 25రూపాయలు ఉండగా... ఇప్పుడు 5 రూపాయలకు పడిపోయింది. ఈసారి సాగు బాగుంది.. గిట్టుబాటు ధర లభిస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. వనపర్తి జిల్లా రైతులపరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్​లో అమ్మాలనుకున్నా... ప్రయాణఖర్చులు భరించలేక అలాగే పంటను పొలంలోనే నిల్వ చేస్తున్నారు.

ధర కోసం ఎదురుచూపులు...

45 రోజులుగా కాపు కాస్తూ, పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పండించినప్పుడే కాకుండా ఇప్పటికీ కష్టపడినా లాభం లేదని కర్షకులు వాపోతున్నారు. ఇలా ఎన్నాళ్లు కష్టపడతామంటూ కొందరు రైతన్నలు పంటను నేలపాలు చేస్తున్నారు.

కిలో ధర రూ.20 ఉండాలి

రైతుల కోసం అది చేస్తున్నాం... ఇది చేస్తున్నాం అని చెప్తున్న ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరను కిలోకు 20 రూపాయలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details