వనపర్తి జిల్లాలో ఉపాధిహామీ పథకం విజయపథంలో ముందుకు సాగిపోతున్నది. జిల్లా పరిధిలోని తొమ్మిది మండలాల్లో నిత్యం సుమారు 31,775 మంది వేతనదారులు ఉపాధి పొందుతున్నారు. భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో అధికారులు నీటి సంరక్షణ, రైతులకు సంబంధించి సుస్థిర ఆస్తుల కల్పనపై దృష్టి సారించారు.
రైతులు ముందుకు రావాలి
పథకం కింద చేపడుతున్న పనులపై రైతులు ఆకర్షితులయ్యారు. ఇప్పటికే వ్యవసాయ భూముల్లో నీటి సంరక్షణ పనులు చేయించుకున్న వారిని చూసి మరికొందరు ముందుకొస్తున్నారు. ఈ పథకం వల్ల నీటి నిల్వలు పెరగడమే కాకుండా ఉపాధి కూడా దొరుకుతోందని అధికారులు అంటున్నారు.
ఎండాకాలంలో వేతనం పెంచాలి
ఎండల వల్ల ఎక్కువ పని చేయలేకపోతున్నామని.. దానివల్ల తక్కువ వేతనం వస్తోందని వేతనదారులు వాపోతున్నారు. వేతనం ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ పథకం ద్వారా భూమి అభివృద్ధి పనులతో పాటు, నీటి సంరక్షణ, రైతుల భూమికి సంబంధించి చాలా పనులు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. దీనివల్ల రైతుకు మేలు జరగడమే కాకుండా వేతనదారులకు పని దొరుకుతుంది.
ఇదీ చదవండి: మున్సిపాలిటీలో కలపొద్దు.. మా పొట్టమీద కొట్టొద్దు..