వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో మొసలి లభ్యమైంది. దంతనూర్ నుంచి శంకరమ్మపేటకు వెళ్లే దారిలో రామన్పాడ్ నీటి పైపులైన్ గేట్ వాల్వ్ గుంతలో 6 అడుగుల మొసలిని గ్రామస్థులు గుర్తించారు. యువకులు తాళ్లతో మొసలిని బంధించి... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది మొసలిని ఆటోలో జూరాల జలాశయంలో విడిచిపెట్టేందుకు తరలించారు. ఎక్కడైనా వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని రేంజ్ అధికారి రవీందర్ రెడ్డి, సెక్షన్ అధికారి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు సూచించారు.
శంకరమ్మపేటలో మొసలి కలకలం - wanaparthy
వనపర్తి జిల్లా శంకరమ్మపేటలో మొసలి లభ్యమైంది. అటవీ శాఖ అధికారులకు దానిని బంధించారు. జూరాల జలాశయంలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లారు.
మొసలి కలకలం