తెలంగాణ

telangana

ETV Bharat / state

మైనారిటీ గురుకుల విద్యార్థుల ఆందోళన

ఉడికీఉడకని  భోజనం, నాణ్యత లేని ఆహారాన్ని పెడుతున్నారని  విద్యార్థులు ధర్నాకు దిగిన ఘటన వనపర్తి జిల్లా కానాయపల్లి మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో జరిగింది. విషయం తెలుసుకుని పాఠశాలకు చేరుకున్న గురుకుల పాఠశాల సమన్వయ కర్త, తహసీల్దార్​ రమేశ్​ రెడ్డి, ఎస్సై విజయ భాస్కర్... విద్యార్థులతో మట్లాడి ఆందోళన విరమింపజేశారు.

minority school students protest in wanaparthy district
మైనారిటీ గురుకుల విద్యార్థుల ఆందోళన

By

Published : Jan 23, 2020, 2:55 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉడికీఉడకని భోజనం, నాణ్యత లేని ఆహారాన్ని పెడుతున్నారని ధర్నాకు దిగారు. ఉడకని చికెన్, అన్నం, మిఠాయి​లో చక్కెరకు బదులుగా ఉప్పు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లలో లైట్లు లేవని, నీటి వసతి సక్రమంగా లేదని, ఫ్యాన్లు పని చేయడం లేదన్నారు.


ఆందోళన విషయం తెలుసుకుని పాఠశాలకు చేరుకున్న గురుకుల పాఠశాల సమన్వయ కర్త, తహసీల్దార్​ రమేశ్​ రెడ్డి, ఎస్సై విజయ భాస్కర్ విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆందోళన విరమించారు.

మైనారిటీ గురుకుల విద్యార్థుల ఆందోళన

ఇదీ చూడండి: దారుణం: తాతయ్య, నానమ్మే చంపేశారు

ABOUT THE AUTHOR

...view details