పసిపిల్లల్లో ప్రాణాంతకమైన రోగాలను నివారించేందుకు రాష్ట్ర వైద్య శాఖ తరఫున పదిరకాల వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో కేంద్రప్రభుత్వం కనుగొన్న రోటా వైరస్ వ్యాక్సిన్‌ను ఏడాదిలోపు పిల్లలకు మందు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ శ్వేతా మహంతితో కలిసి ప్రారంభించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని అతి ఖరీదైన రోటా వైరస్ వాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. ఏడాదిలోపు ఉన్న ప్రతీ చిన్నారికి గ్రామస్థాయిలోని ప్రతీ ఆశా కార్యకర్త తప్పకుండా అందజేస్తారని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రులపై ఉన్న అపనమ్మకాన్ని వదిలి... నమ్మకంతో వైద్యం చేయించుకోవాలని మంత్రి సూచించారు.
నమ్మకంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం చేయించుకోండి... - కలెక్టర్ శ్వేతా మహంతి
ప్రభుత్వాసుపత్రులపై నమ్మకంతో వైద్యం చేయించుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి... చిన్నపిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి పాల్గొన్నారు.
minister_niranjanreddy_launched_rota_virus_vaccine_at_wanaparthi