తెలంగాణ

telangana

ETV Bharat / state

'గణపసముద్రంలో మొదిటిసారిగా రొయ్యల పెంపకం' - కలెక్టర్ శ్వేతా మహంతి

వనపర్తి జిల్లా గణప సముద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి రొయ్య పిల్లలను వదిలారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోనే మొదటిసారిగా గణపసముద్రం రొయ్యల పెంపకం చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

'గణపసముద్రంలో మొదిటిసారిగా రొయ్యల పెంపకం'

By

Published : Nov 25, 2019, 12:33 PM IST

'గణపసముద్రంలో మొదిటిసారిగా రొయ్యల పెంపకం'
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం గణప సముద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి రొయ్య పిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయితీ చేప పిల్లల పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గణపసముద్రం రొయ్యల పెంపకం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందని .. వాటి విక్రయానికి కావాల్సిన అధునాతన మార్కెట్​లను కూడా నిర్మిస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details