తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలో పాలమూరు ఎత్తిపోతల పరిశీలనకు కేసీఆర్​: నిరంజన్​రెడ్డి - wanaparthy

పాలమూరు ఎత్తిపోతల పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్​ రానున్నారని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా గోపాల్​పేట్​ నుంచి నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రం మధ్య రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

త్వరలో పాలమూరు ఎత్తిపోతల పరిశీలనకు కేసీఆర్​ : నిరంజన్​రెడ్డి

By

Published : Aug 25, 2019, 9:35 PM IST

వనపర్తి జిల్లా గోపాల్​పేట్​ నుంచి నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రం వరకు నిర్మించనున్న రహదారికి మంత్రి నిరంజన్​రెడ్డి శంకుస్థాపన చేశారు. రేవల్లి మీదుగా సుమారు 30 కిలోమీటర్ల రహదారికి 2014లోనే 49 కోట్లు మంజూరయ్యాయి. శంకుస్థాపన అనంతరం మంత్రి కొద్దిసేపు ప్రొక్లెయిన్​​తో మట్టి తీశారు. రహదారి అందుబాటులోకి వస్తే గోపాల్​పేట్​ నుంచి నాగర్​కర్నూల్​ చేరేందుకు అనువుగా ఉంటుందని మంత్రి తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పనులు పరిశీలించేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ జిల్లాకు రానున్నారని మంత్రి తెలిపారు.

త్వరలో పాలమూరు ఎత్తిపోతల పరిశీలనకు కేసీఆర్​ : నిరంజన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details