కల్యాణలక్ష్మి సహాయం కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 125 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు.
'పథకాల లబ్ధి కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు' - మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 125 మంది లబ్ధిదారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి... కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మి సహాయం కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
'పథకాల లబ్ధి కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు'
నిరుపేదల ఇళ్లల్లోని ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే కల్యాణ లక్ష్మి సహాయం అని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రికి లబ్ధిదారులు అందరూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపాలని మంత్రి కోరారు.