తెలంగాణ

telangana

ETV Bharat / state

'వేల ఎకరాలకు సాగు నీరందించే రిజర్వాయర్​ నిర్మిస్తాం' - వనపర్తి జిల్లా కిష్టాపూర్​లో రిజర్వాయర్

వనపర్తి జిల్లా పానుగల్​ మండలం కిష్టాపూర్​లో మంత్రి నిరంజన్​రెడ్డి పర్యటించారు. గ్రామ శివారులో రామన్న గట్టు వద్ద రిజర్వాయర్​ ఏర్పాటు కోసం అవసరమయ్యే భూములను పరిశీలించారు.

minister niranjan reddy about reservoir in wanaparthy district
'వేల ఎకరాలకు సాగు నీరందించే రిజర్వాయర్​ నిర్మిస్తాం'

By

Published : Mar 20, 2020, 5:17 PM IST

'వేల ఎకరాలకు సాగు నీరందించే రిజర్వాయర్​ నిర్మిస్తాం'

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి వనపర్తి జిల్లా పానుగల్​ మండలం కిష్టాపూర్​లో పర్యటించారు. కొల్లాపూర్​ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డితో కలిసి రామన్న గుట్ట వద్ద పొలాల్లో తిరిగారు. రిజర్వాయర్​ ఏర్పాటు కోసం అవసరమయ్యే భూముల సర్వే నంబర్లను తహసీల్దార్​ను అడిగి తెలుసుకున్నారు.

రిజర్వాయర్​ ఏర్పాటులో రైతుల భూములు పోవని, దాదాపు అటవీ, ప్రభుత్వ భూముల్లోనే రిజర్వాయర్​ నిర్మాణం చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కొన్ని వేల ఎకరాలకు సాగు నీరందించే విధంగా నిర్మిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details