మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం శివారులో ఏకో పార్క్, పెబ్బేరు రహదారికి ఇరువైపులా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ యాస్మిన్ భాష చేపట్టారు. నాటిన మొక్కలను పట్టణ మున్సిపాలిటీ సిబ్బంది నిత్యం పర్యవేక్షించాలని, వాటి సంరక్షణ వ్యక్తిగత బాధ్యతగా భావించాలని ఆమె సూచించారు.
మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన కలెక్టర్ - వనపర్తి జిల్లా తాజా వార్త
మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ యాస్మిన్ భాష చేపట్టారు. నాటిన మొక్కలను తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి వాటిని పెంచాలని మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు.
మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన కలెక్టర్
పచ్చదనాన్ని పరిరక్షించేందుకు మున్సిపాలిటీ బడ్జెట్లో పది శాతం నిధులను ఇందుకే కేటాయించాలన్నారు. మొక్కల పెంపకం, కలుపు తీయడం, నీటి సరఫరా తదితర అంశాలకు ఆ నిధులను వాడుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళిక తయారు చేశామని, దాని ప్రకారం రానున్న దసరా నాటికి పట్టణంలో గుర్తించిన స్థలాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల
Last Updated : Mar 3, 2020, 7:28 PM IST