తెలంగాణకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని.. ఏదో చేస్తారని ఐదేళ్ల క్రితం భారీ మెజార్టీతో మోదీని ప్రజలు గెలిపిస్తే పన్నుల భారమే మిగిలిందన్నారు మంత్రి మల్లారెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. వికారాబాద్ జిల్లా చేవెళ్లలో జరిగిన తెరాస పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భాజపా, కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవు: మల్లారెడ్డి - KTR
చేవెళ్లలో తెరాస ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు మంత్రి మల్లారెడ్డి. ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టడం లేదని పార్టీ పార్లమెంటరీ సన్నాహాక సమావేశంలో ఎద్దేవా చేశారు.
భాజపా, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు కూడా దక్కవు : మంత్రి మల్లారెడ్డి