తెలంగాణ

telangana

ETV Bharat / state

వనపర్తిలో వైద్యుడు లేని ప్రభుత్వాసుపత్రి - ROGULU

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక కేంద్రాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు.  మందులున్నా, వైద్య పరికరాలున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇందుకు ప్రధాన కారణం వైద్యుల కొరత.

వనపర్తిలో వైద్యుడు లేని ప్రభుత్వాసుపత్రి

By

Published : Mar 27, 2019, 5:47 AM IST

Updated : Mar 27, 2019, 9:31 AM IST

వనపర్తిలో వైద్యుడు లేని ప్రభుత్వాసుపత్రి
వనపర్తి జిల్లా అమరచింత పట్టణ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా రోగులకు ఉపయోగపడడం లేదు. వైద్యులు లేకపోవడం, ఉన్నది ఒకే ఒక్క స్టాఫ్ నర్సు కావడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణిలు, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ప్రభుత్వాసుపత్రులు లేకపోవడం వల్ల ఆర్​ఎంపీ వైద్యులపై ఆధారపడుతున్నారు. దీని వల్ల వ్యాధుల తీవ్రత పెరిగి మరణాలకు దారి తీస్తోంది.

ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు సమస్యను విన్నవించినా పట్టించుకోలేదని రోగులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వైద్యులను నియమించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Last Updated : Mar 27, 2019, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details