ఉచిత వైద్యం..
సర్పంచ్ చొరవతో గర్బిణీలకు పౌష్టికాహారం - sarpanch
గర్బిణీ స్త్రీలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని భావించాడు ఓ గ్రామ సర్పంచ్. అనుకున్నదే తడవుగా పలు స్వచ్చంద సంస్థలను ఆశ్రయించాడు. మెరుగైన పౌష్టికాహారం, వైద్యం అందించడానికి హైదరాబాద్లోని యశోద ఫౌండేషన్ ముందుకొచ్చింది.
గర్బిణీలకు పౌష్టికాహారం
సంస్థ ఆధ్వర్యంలో సంవత్సరం లోపు చిన్నారులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. చిన్నారులకు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే యశోద స్వచ్చంద సంస్థ ఉచితంగా వైద్యం చేస్తామని హామీ ఇచ్చింది. కార్యక్రమానికి వందేమాతరం ఫౌండేషన్ సమన్వయకర్త మాధవరెడ్డి హాజరై గ్రామంలోని గర్బిణీ, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.