వనపర్తి జిల్లాకేంద్రంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో ఇల్లు కోల్పోయిన అందిరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండలంలోని అప్పాయిపల్లి గ్రామ శివారులోని చిట్యాలమిట్టపై నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి.. ఇల్లు లేని పేదలకు అందించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.
‘ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇస్తాం’
వనపర్తి పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణ వల్ల ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామ శివారు చిట్యాల మిట్టపై నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు.
పెద్దగూడెం చౌరస్తాలో 296, అప్పాయిపల్లి శివారులో 160 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించడానికి సిద్ధం కాగా.. చిట్యాల శివారులో 760 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావొచ్చిందన్నారు. నాలుగు నెలల్లో నియోజకవర్గ ప్రజలకు 1400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి తెలిపారు. జిల్లా పరిధిలోని నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని రెండువేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని లేఖ రాశానని.. త్వరలో ముఖ్యమంత్రి నుంచి మంచి వార్త వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు