కొత్తగా ఏర్పడిన పాలకవర్గం జిల్లాలోని అన్ని మండలాలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్గా లోకనాథ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ వామన గౌడ్..మిగతా సభ్యులతో కలెక్టర్ శ్వేతామహంతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. ప్రజల సమన్వయంతో ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి తో పాటు జడ్పీటీసీలను పూలమాలలు శాలువాలతో సన్మానించారు . అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.
జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించండి - AGRICULTURE MINISTER NIRANJAN REDDY
జిల్లా పరిషత్ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులు జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ప్రజల సమన్వయంతోనే ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలి : మంత్రి నిరంజన్ రెడ్డి