వనపర్తిలో కానిస్టేబుల్ మాక్ ఎగ్జామ్ - apoorva rao
కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి పోలీసుల ఆధ్వర్యంలో మోడల్ టెస్ట్ నిర్వహించారు. అభ్యర్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు పరీక్షలు పెట్టారు.
కానిస్టేబుల్ మాక్ ఎగ్జామ్
వనపర్తి పరిధిలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా ఏఎస్పీ అపూర్వరావు ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు జరిపారు. వివిధ గ్రామాల నుంచి 423 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తడబడకుండా పరీక్షలు రాసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అపూర్వరావు తెలిపారు.