తెలంగాణ

telangana

ETV Bharat / state

చావులోనూ వీడని పేగుబంధం - accidently fall

వేసవి సెలవులకు ఇంటివద్దే ఉన్న ఆ పాప తల్లితో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లింది. గట్టు మీద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. కూతుర్ని కాపాడేందుకు తల్లి కూడా దూకేసింది. పాపకు తోడుగా ఆమె కూడా మృత్యు ఒడికి చేరింది.

చెరువులో పడి తల్లీ, కూతురు మృతి

By

Published : May 14, 2019, 3:15 PM IST

వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కలిసి వెళ్లిన తల్లి కూతురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. గోపాలపేట గ్రామానికి సమీపంలో ఉన్న రెడ్ల కుంటలోకి బట్టలు ఉతికేందుకు మాణిక్యమ్మ కూతురుతో కలిసి వెళ్లింది. గట్టు మీద ఆడుకుంటున్న పాప ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. బిడ్డను రక్షించేందుకు వెళ్లిన తల్లి కూడా మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులో పడి తల్లీ, కూతురు మృతి

ABOUT THE AUTHOR

...view details