వనపర్తి జిల్లాలో తెరాస 18వ ఆవిర్భావ దినోత్సవం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జెండా ఎగురవేశారు. ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందని, నేడు బంగారు తెలంగాణ దిశగా పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి పని చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే కాపీ కొట్టి వారి మేనిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చారని స్పష్టం చేశారు.
'రైతుబంధు పథకాన్ని...కేంద్రమే కాపీ కొట్టింది' - minister niranjan reddy
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెరాస ఆవిర్భవించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ దిశగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం : నిరంజన్ రెడ్డి